MDCL:HYDలో 325కి పైగా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నప్పటికీ నిబంధనలు అమలు కావడం లేదు. నియమాల ప్రకారం కనీసం 25 గంటల ప్రాక్టికల్ ట్రైనింగ్, రోడ్డు భద్రతపై క్లాసులు తప్పనిసరి. కానీ.. చాలా స్కూల్స్ వారం, పది రోజుల్లోనే కోర్సు ముగిస్తున్నాయి. సరైన శిక్షణ లేకుండా “అన్నీ మేమే చూసుకుంటాం” అంటూ వేలు వసూలు చేసి బ్రోకర్ దందా నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.