PLD: గుంటూరు మిర్చియార్డులో ఖాళీ గోనెసంచి ధరను రూ.25 నుంచి రూ.40కి పెంచడం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జన్మదినం సందర్భంగా యార్డు పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులకు దాదాపు రూ.40కోట్ల మేలు జరుగుతుందని పెదకూరపాడు టీడీపీ మండల అధ్యక్షుడు ఏటుకూరి బ్రహ్మయ్య అన్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.