MHBD: వేసవి వేళ జిల్లాలోని ప్రధాన పట్టణాలల్లో మట్టి కుండలకు, రంజన్లకు గిరాకీ పెరిగింది. ఇంట్లో ఫ్రిజ్ లేని నిరుపేదలు మట్టి కుండలు, రంజన్లలోని చల్లటి నీటిని తాగుతూ సేద తీరుతున్నారు. ఫ్రిజ్లోని చల్లటి నీరు తాగడం వలన జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల బారిన పడుతుండడంతో కుండలో నీటిని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మట్టి కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.