ప్రపంచవ్యాప్తంగా నిన్న ChatGPT సేవల్లో అంతరాయం కలగడంతో మిలియన్ల మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య కారణంగా వేలాది మంది వినియోగదారులు లాగిన్ అవ్వలేకపోయారు. చాట్ హిస్టరీ లోడ్ అవ్వకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో యూజర్లు SM వేదికగా ఫిర్యాదులు చేశారు. OpenAI ఇంజనీర్లు ఈ సాంకేతిక లోపాన్ని పరిష్కరించారు. ప్రస్తుతం అన్ని సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.