HNK: ఈనెల 25వ తేదీన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించే నూతన పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి నడికూడ మండలం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని జాగృతి నేతలు అన్నారు. నడికూడ మండల కేంద్రంలో నూతన పార్టీ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్లను జాగృతి నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దండు సుధాకర్, రమేష్, ప్రభాస్, మధుకర్, చందు ఉన్నారు.