VZM: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హార్టివిజన్ కార్యక్రమం ద్వారా ఎనిమిదివేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అందుకు గాను అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా మండలాల్లో ఉన్న ఉద్యాన, వ్యవసాయ, విద్యుత్, రెవిన్యూ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు.