BHNG: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. శనివారం వలిగొండ మండలంలోని సుంకిశాల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.