BDK: మహిళా బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల మహిళలు తీవ్రంగా ఖండించాలని జిల్లా బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గాయత్రి ఇవాళ పిలుపునిచ్చారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళా హక్కులను కాలరాయడం వారి వక్ర నీచ బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు.