కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు సచివాలయాల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది గైర్హాజరు, రిజిస్టర్ల లోపాలను గుర్తించారు. జనాభాకు తగ్గ సిబ్బంది లేకపోవడం, సేవలు తక్కువగా అందడంపై అసంతృప్తి తెలిపారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.