NDL: ప్యాపిలి మండలంలోని సిగురుమన సర్కిల్ సమీపంలో ‘మన గ్రోమోర్’ నూతన వ్యవసాయ దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి రాకేశ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సలహాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆపరేషన్ మేనేజర్ ధనుంజయ్, మార్కెటింగ్ ప్రతినిధి గిరి, స్టోర్ మేనేజర్ రాయల్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.