AP: వైసీపీ నేత మోహిత్ రెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే అర్హత చెవిరెడ్డి కుటంబానికి లేదన్నారు. పెద్దిరెడ్డి, భూమన సహా అనేక మంది వైసీపీ నేతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. చెవిరెడ్డి కుటుంబాన్ని జగన్ పక్కనపెట్టారని.. ఆ విషయం రాష్ట్రమంతా తెలుసని అన్నారు.