MLG: మల్లంపల్లి మండలంలోని పలు రేషన్ షాపులను జిల్లా పౌర సరఫరాల అధికారి షా ఫైసల్ హుస్సేని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూడు నెలల కోటాగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలని డీలర్లను ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీటీ విజయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.