TG: BJP ఎంపీ తేజస్వి సూర్యపై మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం, ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతినేలా తేజస్వి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచినందుకు ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.