ATP: రోజురోజుకు ఎండల తీవ్రత పెరగడంతో జనాలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇందులో భాగంగా పామిడి పట్టణం నిత్యం కొనుగోలుదారులతో కళకళలాడే మెయిన్ బజార్ కొనుగోలుదారులు లేక నిర్మానుష్యంగా మారింది. ఎండలు విపరీతంగా ఉండడంతో అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.