CTR: వేసవి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 36-40°C మధ్య నమోదవుతున్నాయని, త్వరలో హీట్ వేవ్ అవకాశం ఉందన్నారు. తగినంత నీరు తాగి, ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.