PDPL: శ్రీరాంపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాజారాం ఇవాళ కలెక్టర్ శ్రీ హర్ష చేతుల మీదుగా FLN ఛాంపియన్ పాఠశాల ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. పెద్దపల్లిలో జరిగిన డిస్ట్రిక్ట్ కాంక్లేవ్‌లో భాగంగా ఇవాళ ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలను FLN ఛాంపియన్ పాఠశాలలుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.