ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మి వాడకు చెందిన తాడక కార్తీక ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభకనబనిచింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో కార్తీక 1000 మార్కులకు గాను 909 మార్కులు సాధించి ‘ఏ’ గ్రేడ్ కైవసం చేసుకుంది. సంస్కృతంలో 97, ఫిజిక్స్‌లో 60, మ్యాథ్స్ ఏ లో 68 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. దీంతో విద్యార్థినిని పలువురు అభినందించారు.