SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని నయానగర్కు చెందిన పోళ్ళ రోహిణి ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ చాటింది. ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె 470 మార్కులకు గాను 466 సాధించి రాష్ట్ర స్థాయిలో తృతీయ ర్యాంక్ కైవసం చేసుకుంది. రోహిణి సాధించిన ఈ విజయంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.