MBNR: ఇంటర్ ఫలితాల్లో జడ్చర్ల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని జేబా ఫిర్టోస్ అద్భుత ప్రతిభకనబరిచారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో ఆమె 1000కి 991 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం 87%, ప్రథమ సంవత్సరం 74% ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రిన్సిపల్ రాధా తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థినిని ఘనంగా అభినందించారు.