ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబాలిజం పెరగడం వల్ల కొవ్వు కరుగుతుంది. నీళ్లు తాగిన తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది మీ మూడ్ను రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది.