SDPT: ఇంటర్ ఫలితాల్లో బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో 80% మంది, ప్రథమ సంవత్సరంలో 55% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో ఎం.వైష్ణవి 922 మార్కులతో టాపర్గా నిలవగా, ఫస్టియర్లో అక్షయ 394 మార్కులతో రాణించారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించింది.