TG: కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ జెండా, ఎజెండాలో నీలి రంగు ప్రధానంగా ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. నీలం రంగు నమ్మకత్వానికి, బడుగు బలహీన వర్గాల వికాసానికి చిహ్నమని పేర్కొన్నారు. ఈనెల 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో పార్టీని ప్రకటించనున్నారు. ‘సామాజిక తెలంగాణ-సర్వోదయ వికాసం’ ఎజెండాగా, ‘తెలంగాణ ఫస్ట్’ సిద్ధాంతంతో ఈ పార్టీ ముందుకు సాగనుంది.