SKLM: పలాసలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం కోసం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి భూసేకరణ ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులు సూచించారు. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. SP మహేశ్వర రెడ్డి, JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉన్నారు.