AP: కడప జిల్లా పులివెందులలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 కిలోల గంజాయి, 110 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన వారిలో వివేకా హత్య కేసులో పలుమార్లు సీబీఐ విచారణ ఎదుర్కొన్న భరత్‌కుమార్ కూడా ఉన్నాడు. గతంలో తుపాకీ లైసెన్స్ కలిగి, ఒకరిని కాల్చి చంపిన కేసులో భరత్ నిందితుడు.