AP: జువ్వలదిన్నె హార్బర్లో చెన్నై బోట్లు అదృశ్యంపై రాజకీయ వివాదం చోటుచేసుకుంది. చెన్నై బోట్లను ఎవరు తీసుకెళ్లారో తేల్చాల్సిందేనని మత్స్యకారులు పట్టుబట్టారు. బోట్లు ఎవరు తీసుకెళ్లారో తెలిసే వరకు రాజకీయ నాయకులను కలవకూడదని నిర్ణయించారు. జువ్వలదిన్నెల జగన్ పర్యటనకూ వెళ్లకూడదని, వెళ్లిన మత్స్యకారుడు రూ. లక్ష జరిమానా చెల్లించాలని తీర్మానంలో పేర్కొన్నారు.