ASF: ఆసిఫాబాద్లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రహదారి భద్రతా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిత హాజరై, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. అనంతరం వాటర్ మిలన్ ద్వారా ప్రమాద తీవ్రత ప్రదర్శించి రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు.