భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు సంప్రదాయ ‘సురక్షిత ఆస్తి’ బంగారంలో పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 2026, మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు ఏకంగా 6 రెట్లు పెరగడమే దీనికి సాక్ష్యం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి మొత్తం రూ. 31,561 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.