SRCL: ఇల్లంతకుంట బీజేపీ మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడిగా బూమల్ల అనిల్ కుమార్ వరుసగా 2వ సారి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చింతలపెల్లి తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా పినికాసి అనిల్, బొల్లం రాంసాగర్లను నియమించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.