ADB: నార్నూర్ మండలంలో వడదెబ్బ తగిలి రాథోడ్ రోహిదాస్(43) అనే వ్యక్తి మృతి చెందారు. తాడిహత్నూర్ గ్రామానికి చెందిన ఆయన శుక్రవారం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లగా తీవ్ర ఎండ ప్రభావానికి గురయ్యారు. అనారోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.