PPM: కురుపాం మండలం వలసబల్లేరు పంచాయతీ పరిధిలోని బొడ్డగాడిగూడ, చాపరాయిగూడ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్గమంతా పెద్ద రాళ్లతో నిండిపోయి ఉండటంతో నడక కూడా కష్టంగా మారింది. తక్షణమే రహదారి ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.