ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘జై హనుమాన్’. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో దగ్గుబాటి రానా భాగం కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన రావణుడిగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రానాకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, ఆయన బేస్ వాయిస్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.