TPT: పిచ్చాటూరు (M) అడవికోడియంబేడు గ్రామంలో నిన్న విద్యుత్ తీగలు తెగిపడటంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తన ఎకరా చెరకు తోట పూర్తిగా కాలిపోయిందని గ్రామ రైతు కే.వీ భాస్కరనాయుడు తెలిపారు. పొలాలపై వెళ్తున్న విద్యుత్ తీగలు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో తెగి చెరకు తోటలో పడ్డాయి. దీంతో భారీగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది.