గద్వాల సంస్థానాధీశుడు నల సోమనాద్రి 1663-1713 మధ్య నిర్మించిన చారిత్రక మట్టికోట శిథిలావస్థకు చేరింది. రాణి మహల్, దర్బార్, 90 అడుగుల గాలిగోపురం, చెన్నకేశవ ఆలయం వంటి నిర్మాణాలు సంరక్షణ లేక కళావిహీనమవుతున్నాయి. ప్రస్తుతం కోటలో ప్రభుత్వ కళాశాల నడుస్తోంది. చారిత్రక ఆనవాళ్లు నశించకముందే కోటను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.