CTR: గుడిపల్లి (M) కుప్పిగాని పల్లి, దాసిమానిపల్లి, అంగనామాల కొత్తూరు గ్రామాల పరిధిలో 105 ఎకరాల భూమిని NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. రూ.2550 కోట్ల పెట్టుబడితో కాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి.