NRML: వేసవిలో అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో సిబ్బంది, రోగులకు అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అదుపు చేయాలో ప్రయోగాత్మకంగా వివరించారు.