KNR: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో శనివారం నుంచి వార్షిక తనిఖీలు ప్రారంభం కానున్నాయి. అఫిలియేషన్ గుర్తింపు నవీకరణలో భాగంగా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఆయా కళాశాలలను సందర్శించనున్నాయి. ముఖ్యంగా కళాశాలల్లో కనీస వసతులు, ల్యాబ్లు, లైబ్రరీ, మైదానం, మరుగుదొడ్లు, అకడమిక్ ప్రమాణాలను ఈ బృందాలు పరిశీలిస్తారు