TG: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది వాట్సాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఇప్పటికే SSC బోర్డు హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసలుబాటు కల్పించింది. 8096958096 నెంబర్‌కు Hi అని మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత SSC రిజల్ట్స్ అని టైప్‌చేసి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఫలితం ప్రత్యక్షమవుతుంది.