నంద్యాల జిల్లా సంజామలలో శుక్రవారం రికార్డు స్థాయిలో 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తల, చెవులు కప్పుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.