NZB: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి 2 పాడి గేదెల పెంపకం పథకానికి ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగించినట్లు ఎంపీడీవో మనోహర్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసి, సంబంధిత మండల/మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.