HNK: శాయంపేట మండలంలోని మాందారిపేట సెంటర్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావులను కాంగ్రెస్ మండల నేతలు కలిశారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని మంత్రి వారికి సూచించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, తదితరులు ఉన్నారు.