WGL: సంగెం(M) మొండ్రాయిలో రైతు గుగులోతు జంపయ్య అనే వ్యక్తి రోడ్డు పై మక్కలు ఆరబోసి రాళ్లు అడ్డం పెట్టారు. అయితే నిన్న రాత్రి రైతు సారంగం రోడ్డుపై ఉన్న రాళ్లు కనిపించకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రైతు సారంగం తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సారంగం కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు SI వంశీకృష్ణ కేసు నమోదు చేశారు.