NDL: ఆత్మకూరులో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా MPPS పాఠశాల ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం అవగాహన కల్పిస్తూ బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 6–14 ఏళ్ల పిల్లలందరూ చదువులో చేరేలా ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉందని తెలిపారు.