NZB: జిల్లాలోని ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో శనివారం కురిసిన భారీ వడగండ్ల వర్షానికి వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. రూపనాయక్ తండాలో సుమారు 50 ఎకరాల్లో పంట నేలకొరగగా, హోన్నజీపేట్, నడిమి తండా ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. చేతికొచ్చిన పంట చేజారడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.