VKB: ఎండలో విధులు నిర్వహించే తాండూరు పట్టణ ట్రాఫిక్ పోలీసులకు లయన్స్ క్లబ్ సభ్యులు చల్లని సాయం అందజేశారు. ఎండలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్.శరణు బసప్ప ఆధ్వర్యంలో క్లబ్ తరఫున పలు వస్తువులు అందజేశారు. నిన్న తాండూరు పట్టణం RTC బస్టాండ్ ఆవరణలో తాండూరు DSP నర్సింగ్ యాదయ్య చేతుల మీదుగా అందజేశారు.