HYD: కాచిగూడ పోలీసులు నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవడానికి గ్లామర్ బైక్ అసలు నంబర్‌ను మార్చి, మరో వాహనం నంబర్ ప్లేట్ వాడుతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగా చలానాలు అసలు వాహన యజమానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై BNS, మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.