ADB: గణితం పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటే సులభంగా నేర్చుకోవచ్చునని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇవాళ ZP సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, విమర్శనాత్మక ఆలోచన, తార్కిక విశ్లేషణ వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.