KRNL: కర్నూలు నగరంలో ‘నషా ముక్త్ భారత్’ అవగాహనలో భాగంగా రాజవిహార్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన వాకథాన్ను ఇవాళ కలెక్టర్ ఏ.సిరి ప్రారంభించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మంచి అలవాట్లతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు.