SRPT: కోదాడ ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం పేరుతో కార్మికులపై భారం మోపుతున్నారని మండి పడ్డారు.