NZB: TU వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులు అని, లక్ష్య సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. ముఖ్య అతిథి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలుకుతూ పాటలతో అలరించారు.