NLG: నిమ్మకాయల మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన నకిరేకల్‌లో వేసవి ప్రభావంతో నిమ్మకాయ ధరలు పెరిగాయి. గత వారంతో పోలిస్తే ఒక్క బ్యాగుపై సుమారు రూ. 500 వరకు ధర పెరిగింది. ప్రస్తుతం పచ్చికాయల బస్తా రూ. 2,500-3,000, పండ్ల బస్తా రూ. 3,000-3,500 వరకు వ్యాపారం జరుగుతోంది. హోల్ సేల్ మార్కెట్లో కిలో ధర రూ. 140 నుంచి 150 మధ్య పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.